నేను యెనిమిదో తొమ్మిదో చదువుతున్నాననుకుంట అప్పుడు. మా ఇంట్లోకి కొత్తగా అద్దెకి దిగారు ఒక కుటుంబం. పురుషోత్తమ శర్మ గారని, పెద్ద కుటుంబమే వాళ్ళది. ఆయన, ఆయన భార్య, ముగ్గురు ఆడ పిల్లలు సత్య, శుభ, పవన ఇంకా ఈ పిల్లల బామ్మ గారు వెరసి మొత్తం ఆరుగురు. పిల్లలు ముగ్గుర్లో సత్య, పవనా కొంచెం అటూ ఇటూగా నా ఈడు వాళ్ళే. శుభ కొంచెం పెద్దది. నాకైతే వీళ్ళందర్నీ చూడగానే భలే సంతోషం వేసింది. ఎంచక్కా [...]
ఆగష్టు, 2007 నెల టపాలు
సిగేరతి షభా (తిరగేసి భాష)
Posted in Uncategorized on ఆగష్టు 31, 2007 | 4 వ్యాఖ్యానాలు »
నిరీక్షణ
Posted in భావోద్వేగం on ఆగష్టు 23, 2007 | 5 వ్యాఖ్యానాలు »
నీ కోసం వేచీ వేచీ కళ్ళు కాయలు కాసాయి
నిన్ను పంపమని వెయ్యి దేవుళ్ళకి మొక్కాను
ఎన్నిసార్లో నా కల్లోకి వస్తావు
నా కలనెపుడు నిజం చేస్తావు?
యుగాలు వీడి కల్పాలు దాటి నా సంకల్పం నెరవేర్చేందుకు వేగంగా రా
అవరోధాలెదురౌతాయని సంకోచించకు
నా ప్రేమ నీ చుట్టూ కవచమై నిన్ను నా దరికి చేరుస్తుంది
నా ప్రతిరూపం నీ రూపమయే ఆ క్షణం కోసం
అనుక్షణం పరితపిస్తూ
క్షణ క్షణం వేచి చూస్తూ
ప్రేమనంతా నీ కోసమే దాచి బరువెక్కిన హృదయంతో
నువ్వే నేను
నేనే నువ్వని
నువ్వు లేని నేనెందుకని
నా జీవితానికొక కొత్త [...]
ఠాగూరు ఎవరు?
Posted in అంతర్మధనం on ఆగష్టు 20, 2007 | 2 వ్యాఖ్యానాలు »
మొన్నామధ్య మా నాన్నగారికి ఫోన్ చేసినపుడు ఆయన చెప్పిన ఒక సంగతి మొదట నాకు నవ్వుతెప్పించినా తరువాత కించిత్తు బాధ కూడా కలిగించింది. విషయం లోకి వెళ్తే మా నాన్నగారికి తరచుగా మందులూ, చిన్న చిన్న పనులూ చేసిపెట్టే తెలుసున్న అతన్ని పిలిచి “నువ్వీసారి రాజమండ్రి వెళ్తే నాకు ఠాగూరు ఫొటో ఒకటి దొరికితే తెచ్చిపెట్ట గలవా” అని అడిగారట. అతను సరే అన్నాడట. మా నాన్నగారు పెద్దవారు అవటం వల్ల బయటకి అంతగా వెళ్ళలేక [...]
నేనూ, నా కాఫీ పిచ్చి!
Posted in నా బలమూ బలహీనతా on ఆగష్టు 17, 2007 | 15 వ్యాఖ్యానాలు »
నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. ఇష్టం కంటే ప్రాణం అంటే బావుంటుందేమో! రోజూ పొద్దున్నే చిక్కటి ఫిల్టర్ కాఫీ తాగనిదే నాకు రోజు మొదలవదు. అలానే సాయంత్రం మళ్ళీ ఇంకో కప్పు కాఫీ సేవిస్తేనే రోజు పూర్తవుతుంది. అయితే ఇది చాలా మందికి వుండే అలవాటేగా ఇందులో వింతేముంది అని మీకు సందేహం రావచ్చు. సమస్యల్లా నా ఈ అలవాటు లో ఏ మాత్రం తేడా వచ్చినా నేను సతమతమైపోతాను. సమయానికి కాఫీ నీళ్ళు [...]
స్త్రీ కి స్వాతంత్ర్యం ఎప్పుడు?
Posted in అంతర్మధనం on ఆగష్టు 14, 2007 | 17 వ్యాఖ్యానాలు »
ఈ ప్రశ్న పురాణకాలం నుంచీ అడుగుతున్నదైనా ఈనాటికీ సమాధానం మాత్రం దొరకలేదు. రోజులు మారాయి ఆడవాళ్ళు ఏదైనా చేయగలరని అనుకుంటున్న ఈ రోజుల్లో నిప్పుల కొలిమిలో నిలువునా కాలిపోతున్న మహిళలు ఇంకా ఎందరో వున్నారు. ఉదాహరణ నా స్నేహితురాలి కధే. నా చిన్ననాటి స్నేహితురాలి జీవితం పెళ్ళి అయిన మూడునాళ్ళకే కన్నీళ్ళ పర్యంతం అయింది. తన పెళ్ళి అయిన నెల లోపే నేను విన్న మొదటి వార్త తను భర్తని వదిలి వచ్చేసిందని. నేను షాక్ తో [...]
అమ్మ
Posted in భావోద్వేగం on ఆగష్టు 14, 2007 | 3 వ్యాఖ్యానాలు »
ఆమె చూపులు వెన్నెల కన్నా చల్లనివి
ఆమె మనసు మల్లెల కన్నా మెత్తనిది
ఆమె ప్రేమ సంద్రం కంటే లోతైనది
ఆమె పలుకులు అమృతం కంటే తీయనివి
ఆమె అన్నిటి కన్నా అపురూపమైనది
ఆమే ‘అమ్మ’
నేనూ, నా బ్లాగ్
Posted in Uncategorized on ఆగష్టు 14, 2007 | 4 వ్యాఖ్యానాలు »
నమస్కారం, నా పేరు వసుంధర. నా గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు కానీ నేను చెప్పాలనుకున్నవి చాలా వున్నాయి. బ్లాగ్ క్రియేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ చాలా సార్లు ఎన్నో విషయాలపై మనసు స్పందించినపుడు ఆ స్పందనలను వ్యక్తీకరించటానికి సరి అయిన అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో సంగతులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది నాకు మంచి అవకాశం. బ్లాగ్ ప్రజలందరు సహకరిస్తారని కోరుతూ,
వసుంధర.
నా భావాలు
Posted in భావోద్వేగం on ఆగష్టు 14, 2007 | 4 వ్యాఖ్యానాలు »
ఇన్నాళ్ళూ నా భావాలు
సెలయేటి లో చిరు చినుకులు
ఈ నాడు నా భావాలు
సముద్రంలో ఉప్పొంగే కెరటాలు
గాంధీయిజం మాస్ కి వంటపట్టదా?
Posted in Movies (సినిమాలు) on ఆగష్టు 13, 2007 | 3 వ్యాఖ్యానాలు »
ఈ మధ్య శంకర్ దాదా జిందాబాద్ సినిమా విడుదలయ్యాక అన్ని వెబ్ సైట్ల లోను ఒకటే మాట. సినిమా ‘ఏ’ సెంటర్ల లోనే బాగా ఆడుతోందని, ‘బి’, ‘సి’ సెంటర్ల వాళ్ళకి గాంధీయిజం పట్టలేదని ఆన్ లైను పత్రికలన్నీ కోడై కూసాయి. ప్రతి చెత్త సినిమానీ పొగిడేసే పత్రికల వాళ్ళు ఈ సినిమానికి మాత్రం ‘3′ రేటింగు ఇవ్వటం ఇవన్నీ చదివి కొద్దిగా మనసు కలత చెంది ఇది రాస్తున్నాను. పత్రికల వాళ్ళ సంగతి వదిలేస్తే నా [...]