Feeds:
టపాలు
వ్యాఖ్యలు

ఆగష్టు 14th, 2007 నాటి టపాలు

ఈ ప్రశ్న పురాణకాలం నుంచీ అడుగుతున్నదైనా ఈనాటికీ సమాధానం మాత్రం దొరకలేదు. రోజులు మారాయి ఆడవాళ్ళు ఏదైనా చేయగలరని అనుకుంటున్న ఈ రోజుల్లో నిప్పుల కొలిమిలో నిలువునా కాలిపోతున్న మహిళలు ఇంకా ఎందరో వున్నారు. ఉదాహరణ నా స్నేహితురాలి కధే. నా చిన్ననాటి స్నేహితురాలి జీవితం పెళ్ళి అయిన మూడునాళ్ళకే కన్నీళ్ళ పర్యంతం అయింది. తన పెళ్ళి అయిన నెల లోపే నేను విన్న మొదటి వార్త తను భర్తని వదిలి వచ్చేసిందని. నేను షాక్ తో [...]

పూర్తి టపాని చదవండి »

ఆమె చూపులు వెన్నెల కన్నా చల్లనివి
ఆమె మనసు మల్లెల కన్నా మెత్తనిది
ఆమె ప్రేమ సంద్రం కంటే లోతైనది
ఆమె పలుకులు అమృతం కంటే తీయనివి
ఆమె అన్నిటి కన్నా అపురూపమైనది
ఆమే ‘అమ్మ’

పూర్తి టపాని చదవండి »

నమస్కారం, నా పేరు వసుంధర. నా గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు కానీ నేను చెప్పాలనుకున్నవి చాలా వున్నాయి. బ్లాగ్ క్రియేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ చాలా సార్లు ఎన్నో విషయాలపై మనసు స్పందించినపుడు ఆ స్పందనలను వ్యక్తీకరించటానికి సరి అయిన అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో సంగతులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది నాకు మంచి అవకాశం. బ్లాగ్ ప్రజలందరు సహకరిస్తారని కోరుతూ,
వసుంధర. 

పూర్తి టపాని చదవండి »

ఇన్నాళ్ళూ నా భావాలు
సెలయేటి లో చిరు చినుకులు
ఈ నాడు నా భావాలు
సముద్రంలో ఉప్పొంగే కెరటాలు

పూర్తి టపాని చదవండి »