నీ గురించి రాయాలని వేల సార్లనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. నీ ప్రేమని తల్చుకొని తట్టుకొనే శక్తి నాకు లేదనిపించింది. నీ జ్ఞాపకాలతో వచ్చే ఉద్వేగాన్ని భరించలేనేమోననిపించింది. కానీ నీ గురించి, నువ్వు నా మీద చూపించిన ప్రేమ గురించి రాస్తే నా మనసుకు కొంతైనా సాంత్వన కలుగుతుందేమోననే ఆశ..!!! అందుకే రాయాలని నిశ్చయించాను.
కాలం అన్నింటినీ మర్చిపోయేలా చేయగలదంటారు. కానీ 15 సం||లు కావస్తున్నా ఏ కాలమూ, ఏ సంవత్సరమూ, ఏ సంతోషమూ నిన్ను మర్చిపోయేలా చేయలేకపోయింది. [...]
జనవరి, 2009 నెల టపాలు
నీ స్మృతిలో …
Posted in అంతర్మధనం on జనవరి 31, 2009 | 2 వ్యాఖ్యానాలు »