వీకెండొస్తోందంటే చాలు శుక్రవారం నుంచే నేను ప్లాన్లు మొదలుపెడతాను. శుక్రవారం సాయంత్రాన్ని నాకెపుడూ వృధా చేయాలనిపించదు పైగా అది ఎంతో విలువైనది కూడానూ. ఎందుకంటే తరువాత వచ్చే శనివారం సాయంత్రమేమో ఇంకేముంది ఇంక వున్నది ఆదివారమొక్కరోజేగా అని బెంగ తో గడపాల్సివస్తుంది. ఆదివారం గురించి చెప్పనే అక్కర్లేదు మర్నాడొచ్చే సోమవారం నుంచీ పొలోమని తను ఆఫీసుకు నేను కాలేజీకు పోవాలి. అందుకే శుక్రవారం మాత్రం ఏ చీకూ, చింతా లేకుండా గడపాలని ఉంటుంది నాకు. అయితే [...]
‘Uncategorized’ అనే వర్గంలోని టపాలు
శుక్రవారం నాది కాదు..
Posted in Uncategorized on మార్చి 15, 2008 | 15 వ్యాఖ్యానాలు »
మా సోనా..!!
Posted in Uncategorized on సెప్టెంబరు 17, 2007 | 6 వ్యాఖ్యానాలు »
నాకు పెళ్ళయిన వెంటనే బెంగుళూరుకు వచ్చేసాను. వచ్చిన వారం లోపే అనుకుంటాను ఒకరోజు ఏమీ తోచక బయట బాల్కనీ లో నిల్చున్నాను. ఆ ఇంట్లో మేము పైన అద్దెకుండేవాళ్ళం కింద ఇల్లుగలవాళ్ళు ఉండేవాళ్ళు. చుట్టూ చూస్తుంటే ఇంచుమించు మా డాబా కి ఆనుకుందా అన్నంత దగ్గర్లో ఉన్న పక్క మేడ మీద గోధుమ రంగులో ఉన్న ఒక కుక్క నా వైపే చూస్తూ తోకాడిస్తోంది(నేనెవరో తెలీకపోయినా). దాన్ని చూడగానే ముద్దొచ్చి లోపలికెళ్ళి దానికి తినటానికి ఒక బిస్కట్టు [...]
సిగేరతి షభా (తిరగేసి భాష)
Posted in Uncategorized on ఆగష్టు 31, 2007 | 4 వ్యాఖ్యానాలు »
నేను యెనిమిదో తొమ్మిదో చదువుతున్నాననుకుంట అప్పుడు. మా ఇంట్లోకి కొత్తగా అద్దెకి దిగారు ఒక కుటుంబం. పురుషోత్తమ శర్మ గారని, పెద్ద కుటుంబమే వాళ్ళది. ఆయన, ఆయన భార్య, ముగ్గురు ఆడ పిల్లలు సత్య, శుభ, పవన ఇంకా ఈ పిల్లల బామ్మ గారు వెరసి మొత్తం ఆరుగురు. పిల్లలు ముగ్గుర్లో సత్య, పవనా కొంచెం అటూ ఇటూగా నా ఈడు వాళ్ళే. శుభ కొంచెం పెద్దది. నాకైతే వీళ్ళందర్నీ చూడగానే భలే సంతోషం వేసింది. ఎంచక్కా [...]
నేనూ, నా బ్లాగ్
Posted in Uncategorized on ఆగష్టు 14, 2007 | 4 వ్యాఖ్యానాలు »
నమస్కారం, నా పేరు వసుంధర. నా గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు కానీ నేను చెప్పాలనుకున్నవి చాలా వున్నాయి. బ్లాగ్ క్రియేట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ చాలా సార్లు ఎన్నో విషయాలపై మనసు స్పందించినపుడు ఆ స్పందనలను వ్యక్తీకరించటానికి సరి అయిన అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు మాత్రం ఈ బ్లాగ్ ద్వారా ఎన్నో సంగతులు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇది నాకు మంచి అవకాశం. బ్లాగ్ ప్రజలందరు సహకరిస్తారని కోరుతూ,
వసుంధర.