మొన్నామధ్య మా నాన్నగారికి ఫోన్ చేసినపుడు ఆయన చెప్పిన ఒక సంగతి మొదట నాకు నవ్వుతెప్పించినా తరువాత కించిత్తు బాధ కూడా కలిగించింది. విషయం లోకి వెళ్తే మా నాన్నగారికి తరచుగా మందులూ, చిన్న చిన్న పనులూ చేసిపెట్టే తెలుసున్న అతన్ని పిలిచి “నువ్వీసారి రాజమండ్రి వెళ్తే నాకు ఠాగూరు ఫొటో ఒకటి దొరికితే తెచ్చిపెట్ట గలవా” అని అడిగారట. అతను సరే అన్నాడట. మా నాన్నగారు పెద్దవారు అవటం వల్ల బయటకి అంతగా వెళ్ళలేక ఇలా పక్కింటి వాళ్ళకెవరికైనా పని చెప్పినపుడు వాళ్ళు కాదనకుండా చేయటం పరిపాటి. ప్రత్యేకంగా ఠాగూరు పటం ఎందుకడిగారంటే మా నాన్నగారికి ఆధ్యాత్మికతతో పాటుగా, సాహిత్యమన్నా, సంగీతమన్నా ప్రాణం. ఆయన గదిలో ఉండే వివిధ దేవుళ్ళ, దేవతల పటాలతో పాటుగా, రవీంద్రనాధ్ ఠాగూరు, మహా యోగి అరబిందో, రమణ మహర్షి, శ్యామ శాస్త్రి, త్యాగయ్య మొదలగు వారి చిత్ర పటాలు కూడా ఉంటాయి. ఆయన వద్ద ఉన్న ఠాగూరు పటం చిరిగిపోవటంతో పక్కింటి అతన్ని పిలిచి ఠాగూరు పటం కావాలని అడిగారన్నమాట.
అయితే జరిగిందేమిటంటే అతను అన్నట్లుగానే ఠాగూరు పటం తెచ్చాడు కానీ అది తన సుమధుర గేయాల గానమైన గీతాంజలితో ప్రపంచాన్ని జాగృతపరచిన విశ్వకవి, నోబుల్ బహుమతి గ్రహీత రవీంద్రనాధ్ ఠాగూరు పటం కాదు, హింసను నమ్ముకుని అమ్ముకుంటున్న వి.వి. వినాయక్ తీసిన ఠాగూరు సినిమా లోని చిరంజీవి గారి పటం. అది చూసి మా నాన్నగారు క్షణ కాలం విస్మయానికి గురయినా తేరుకుని, తను అడిగింది ఏ ఠాగూరు పటమో అతనికి చెప్పారట. ఇది విన్న వెంటనే నాకు ఒక్కసారిగా నవ్వొచ్చినా తరువాత బాధ కలిగింది. సినిమాలు యువత పై ఇంతటి ప్రభావాన్ని చూపిస్తాయా అని. ఆ ప్రభావం ఎంతటి గాఢమైనదంటే విశ్వకవి కవిత్వం కంటే బలంగా వినాయక్ ఠాగూరు ప్రజల్లో నాటుకుందా అనేంత. కానీ అన్ని సినిమాలూ ఇలాగే ప్రభావం చూపిస్తాయంటే అదీ చెప్పలేం. చెడు, హింస ఆకట్టుకున్నంత వేగంగా సత్యాగ్రహాలూ, సందేశాలూ ఆకట్టుకోవుగా మరి.
idi chaala baadaakaara visayam, deeni antatiki kaaranam media, suppose times paper choosinaamu ante adi eppudina front pages lo sanjay dutt, haneef, amitab puttina rooju la gurinchi vrastundi kaani, mana andarini jaajruthini chesina mana mahaa nayakulanu eppudu guruthu chestunnaru.
inkonni rojulu pote, gaandhi gaaru kooda guruthu vundaru manaki alavunnavi ee rojulu.
పాపం ఆ తెచ్చిన అతన్ని ఏమీ అనలేము లెండి.ఇప్పట్లో తల్లిదండ్రులు ఎవరూ పిల్లలకి మంచి సాహిత్యం పరిచయం చేద్దాము అనుకోవట్లేదు.మా వాడికి ఇదొచ్చు,అదొచ్చు అని చెప్పుకోడానికి అందరి ముందూ ప్రదర్శించగలిగేలాంటి విద్యలే నేర్పిస్తున్నాము.అంత దాకా ఎందుకు రెండున్నరేళ్ళ మా అబ్బాయికి వేమన పద్యం నేర్పించాను.మొన్న ఒక గెట్ టుగెదర్ లో వాళ్ళ వాళ్ళ పిల్లల పాండిత్యాన్ని ప్రదర్శించేటప్పుడు మావాడు ఇది పాడితే అందరూ ఎందుకు రాధికా ఇలాంటివి నేర్పుతావు.ఎవరికి అర్ధం అవుతాయి.మాకే అర్ధం కాలేదు అంటూ నవ్వారు.నిజానికి ఆ పద్యానికి భావం మా వాడికి తెలీదు.కానీ నావంతుగా ఏదొ ఒకటి మంచిది నేర్పితే కొన్నాళ్ళకి వాడికే దాని భావం తెలుసుకోవాలన్న అభిలాష కలుగుతుందని నా అభిప్రాయం.అలాగే స్కూల్ లో టీచర్లు కూడా.ఎప్పుడూ ఆ సబ్జెక్ట్ ,ఇది,చెత్త అంటూ చెపుదామనే చూస్తుంటారు గానీ పిల్లల లో సాహిత్యం మీద ఆశక్తి పెంచుదామనుకునే వాళ్ళు చాలా అరుదుగా వుంటారు. అయినా ఈ కాలం లో కూడా అలాంటివి చెపుతారని ఆశించడం తప్పేలే.