నీ కోసం వేచీ వేచీ కళ్ళు కాయలు కాసాయి
నిన్ను పంపమని వెయ్యి దేవుళ్ళకి మొక్కాను
ఎన్నిసార్లో నా కల్లోకి వస్తావు
నా కలనెపుడు నిజం చేస్తావు?
యుగాలు వీడి కల్పాలు దాటి నా సంకల్పం నెరవేర్చేందుకు వేగంగా రా
అవరోధాలెదురౌతాయని సంకోచించకు
నా ప్రేమ నీ చుట్టూ కవచమై నిన్ను నా దరికి చేరుస్తుంది
నా ప్రతిరూపం నీ రూపమయే ఆ క్షణం కోసం
అనుక్షణం పరితపిస్తూ
క్షణ క్షణం వేచి చూస్తూ
ప్రేమనంతా నీ కోసమే దాచి బరువెక్కిన హృదయంతో
నువ్వే నేను
నేనే నువ్వని
నువ్వు లేని నేనెందుకని
నా జీవితానికొక కొత్త అర్ధం నీవవ్వాలని
ఎన్ని వేల సార్లు అనుకున్నానని.
కాఫీ మీద చక్కనిటపా రాసింది మీరేనా అని అనుమానపడేటంత నేలబారుగా ఉంది ఈ టపా.
మీ కామెంటు ఇప్పుడే చూసానండి. ఈ కవిత లో అంత నేలబారుగా ఉన్నంత తప్పేముందో నాకర్ధం కాలేదు. ఒకవేళ మీరు మరోలా అర్థం చేసుకుని ఉంటే నేనేమీ చెయ్యలేను. ఎందుకంటే ఇది ఒక ప్రియుడి గురించి రాసిన కవిత మాత్రం కాదు. సరిగ్గా మనసు పెట్టి చదివితే దేని గురించి రాసానో తెలుస్తుంది. ఏది ఏమైనా మీరు ఓపిగ్గా వ్యాఖ్యానించినందుకు నా ధన్యవాదాలు. ఇందులో మీకనిపించిన తప్పేంటో చెప్తే సంతోషిస్తాను.
తప్పేమీ లేదమ్మా. పోతే కవితాత్మకత లేదు. ఒక పదచిత్రంలేదు. ఆలోచింపజేసే కొత్త భావనలేదు.వెరసి చాలా pedestrian గా ఉంది. పేలవంగా ఉంది అనటమే నా ఉద్దేశ్యం. నచ్చినా నచ్చకపోయినా మాటలు దాచుకోలేను. అదే నా ’బలమూ బలహీనత’ కూడా. మంచి రచనలు మీనుంచి ఆశిస్తున్నాను.
కవితాత్మకత, పదచిత్రం గురించి నాకు తెలీదు. ఆ మాట కొస్తే నేనేమీ కవయిత్రిని కాను. నేను రాసింది గొప్ప కవిత్వమని నేను చెప్పుకోలేదు కదా. అసలు ఇవి నా ఫీలింగ్స్. భావాలను వ్యక్తం చేయటానికి కూడా ఇన్ని ఆలోచించి గ్రంధాలు చదివి నేర్చుకుని రాయాలా? నాకు వచ్చినదేదో, మనసుకు అనిపించినదేదో నేను రాసాను. మీరు అన్నట్లు మీ బలమూ బలహీనతా నాకర్థమైంది. అలాగే అన్నీ బాగా గొప్పగా రాయటం నాకు రాదు. నేనిప్పుడే మొదలుపెట్టాను. కొన్ని అనుకోకుండా బాగా వస్తాయి. I am still a beginner. I will try my best.
ee kavithalo eduru chupunu gurinchi chakkaga vivarinchaaru
ఆలోచింపచేసే ప్రతి కవితా చదువరిని మార్చేసి ఉండి ఉంటే, టాగోర్, శ్రీ.శ్రీ.లు చాలు.
కోడి గుడ్డు మీద ఈకలు వెతికితే బోలెడు.
పళ్ళు ఇచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలని, బాగ రాస్తున్నారు కనుకే ఆశిస్తున్నామని అనచ్చు గాక.
ఈ అక్షరాల వెనుక అర్ధం అమ్మ కావాలని తపించే అమ్మాయికి మాత్రమే అర్ధం అవుతుంది.
కంగ్రాట్స్ ఆన్ యువర్ ట్విన్స్ వసుంధరా!