లోకం చూస్తుండగా నవ్వను నేను
చూస్తే ఓర్వలేదని
లోకానికి తెలీకుండా ఏడుస్తాను నేను
తెలిస్తే పండుగ చేసుకుంటుందని
అసూయాద్వేషాలకు
అక్క చెల్లెళ్ళూ, ఆప్తమిత్రులూ
అతీతులు కారన్న నిజాన్ని చెప్పిన లోకం లో
ఏకాకిగానైనా బ్రతుకుతాను కానీ
మరో కాకినై దానితో ఏకీభవించను.
లోకం లో నేను
సెప్టెంబర్ 10, 2007 vasundhararam చే
చెల్లెమ్మా! జగమంత కుటుంబం నాది అనుకుంటే ఏకాకి జీవితం అవసరం లేదు.
వసుంధర గారూ నమస్కారాలు.
చాల రోజుల తరువాత మీ బ్లాగును పరికించే ఆవకాశం వచ్చింది..మీరు వ్రాసిన లోకంలో నేను లో మహోత్కుష్ట మైన వాక్యం…. మరో కాకినై దానితో ఏకీభవించలేను అన్న పదం ద్వారా ఆత్మ స్థైర్యాన్ని,నిబ్బరాన్ని,లోకానికి చాటుతున్న ఈ భావం చాల గొప్పగా వుంది. కాని మీ కవితలో అంతర్ముఖిగా పయనించే భావనలనుండి (అవి ఏ సందర్భంలోనయినా కొంత సమయమే మనసులో వుంటాయి.) బహిర్ముఖిగాఎదుర్కోవడమే ప్రస్తుత సమాజంలో స్త్రీకయినా పురుషునికైనా ఆచరణీయం. .మీ వ్యక్తీకరణ బాగుంది.. మీ అభిమాని నూతక్కి రాఘవేంద్ర రావు