జాజి తీగ చిగురులో..
వాన చినుకు రాకలో..
లేగదూడ పరుగులో..
అమ్మ జోలపాటలో..
నాలో..ఆశ..గుప్పెడంత ఆశ
Archive for the ‘భావోద్వేగం’ Category
ఆశ
Posted in భావోద్వేగం on మార్చి 9, 2008| Leave a Comment »
నిరీక్షణ
Posted in భావోద్వేగం on ఆగస్ట్ 23, 2007| 6 వ్యాఖ్యలు »
నీ కోసం వేచీ వేచీ కళ్ళు కాయలు కాసాయి
నిన్ను పంపమని వెయ్యి దేవుళ్ళకి మొక్కాను
ఎన్నిసార్లో నా కల్లోకి వస్తావు
నా కలనెపుడు నిజం చేస్తావు?
యుగాలు వీడి కల్పాలు దాటి నా సంకల్పం నెరవేర్చేందుకు వేగంగా రా
అవరోధాలెదురౌతాయని సంకోచించకు
నా ప్రేమ నీ చుట్టూ కవచమై నిన్ను నా దరికి చేరుస్తుంది
నా ప్రతిరూపం నీ రూపమయే ఆ క్షణం కోసం
అనుక్షణం పరితపిస్తూ
క్షణ క్షణం వేచి చూస్తూ
ప్రేమనంతా నీ కోసమే దాచి బరువెక్కిన హృదయంతో
నువ్వే నేను
నేనే నువ్వని
నువ్వు లేని నేనెందుకని
నా జీవితానికొక కొత్త అర్ధం నీవవ్వాలని
ఎన్ని వేల సార్లు అనుకున్నానని.
అమ్మ
Posted in భావోద్వేగం on ఆగస్ట్ 14, 2007| 3 వ్యాఖ్యలు »
ఆమె చూపులు వెన్నెల కన్నా చల్లనివి
ఆమె మనసు మల్లెల కన్నా మెత్తనిది
ఆమె ప్రేమ సంద్రం కంటే లోతైనది
ఆమె పలుకులు అమృతం కంటే తీయనివి
ఆమె అన్నిటి కన్నా అపురూపమైనది
ఆమే ‘అమ్మ’
నా భావాలు
Posted in భావోద్వేగం on ఆగస్ట్ 14, 2007| 4 వ్యాఖ్యలు »
ఇన్నాళ్ళూ నా భావాలు
సెలయేటి లో చిరు చినుకులు
ఈ నాడు నా భావాలు
సముద్రంలో ఉప్పొంగే కెరటాలు